Thursday, 1 October 2026
  • Home  
  • నువ్వూరుపాడు ఎయిడెడ్ పాఠశాల విద్యా కమిటీ ఏకగ్రీవం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నువ్వూరుపాడు ఎయిడెడ్ పాఠశాల విద్యా కమిటీ ఏకగ్రీవం

చైర్మన్‌గా దేవరపాటి వసంత.. వైస్ చైర్మన్‌గా దేవరపాటి మల్లీశ్వరి ఆత్మకూరు, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): నువ్వూరుపాడు ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు మండల యూనిట్ ఇన్‌చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి సూచనల మేరకు ఈ ఎన్నిక నిర్వహించారు.విద్యా కమిటీ చైర్మన్‌గా దేవరపాటి వసంత, వైస్ చైర్మన్‌గా దేవరపాటి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు పలువురు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో బూత్ కన్వీనర్ దేవరపాటి బాలకొండయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపాలు, ఉపాధ్యాయులు తుమ్మల గంగాధర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, సంక్షేమం మెరుగుపడేలా విద్యా కమిటీ సమన్వయంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

చైర్మన్‌గా దేవరపాటి వసంత.. వైస్ చైర్మన్‌గా దేవరపాటి మల్లీశ్వరి

ఆత్మకూరు, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): నువ్వూరుపాడు ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు మండల యూనిట్ ఇన్‌చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి సూచనల మేరకు ఈ ఎన్నిక నిర్వహించారు.విద్యా కమిటీ చైర్మన్‌గా దేవరపాటి వసంత, వైస్ చైర్మన్‌గా దేవరపాటి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు పలువురు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో బూత్ కన్వీనర్ దేవరపాటి బాలకొండయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపాలు, ఉపాధ్యాయులు తుమ్మల గంగాధర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, సంక్షేమం మెరుగుపడేలా విద్యా కమిటీ సమన్వయంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.