గురువుకు పాదాభివందనం చేసిన బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్
సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు
శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో సాయి లహరి ఆర్ట్స్ అకాడమీ, కూచిపూడి భరతనాట్య కళాక్షేత్రం మరియు రుద్ర డేర్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి కాలపు సాంస్కృతిక శిక్షణ తరగతుల ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయని ప్రముఖ నృత్య కళాకారుడు పోలోజి సత్యం తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ హీరో, బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్ హాజరయ్యారు. వేసవి శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు రాము రాథోడ్ చేతుల మీదుగా ట్రైనింగ్ సర్టిఫికెట్లు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా రాము రాథోడ్ మాట్లాడుతూ, తాను ఒకప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పోలోజు సత్యం అకాడమీలోనే శిక్షణ పొందానని, నేడు ఈ స్థాయికి చేరుకోవడంలో తన గురువు పోలోజి సత్యం చేసిన కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కళా గురువు పోలోజి సత్యంను రాము రాథోడ్, విద్యార్థుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. అలాగే తన గురువుకు పాదాభివందనం చేసి గురుభక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో కూచిపూడి భరతనాట్యం నృత్య కళాకారిణి సాయి లహరి, కొట్ర బాలాజీ ప్రముఖ కళాకారులు పద్మాలయ ఆచార్య, ముక్తావళి, మురళీధర్, సత్యం తో పాటు డాన్స్ మాస్టర్ లు వెంకీ, వినయ్ పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రుతి మరియు పెద్ద సంఖ్యలో సాంస్కృతిక కళాకారులు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






