సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో సత్తుపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సత్తుపల్లి టౌన్ అధ్యక్షుడు విజయ్ బానోత్ సూచించారు. వర్షాల కారణంగా రోడ్లు, కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. చిన్నారులను నీటి గుంటలు, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంటివద్దే సురక్షితంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజయ్ బానోత్ విజ్ఞప్తి చేశారు.



