Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

కల్లూరులో కురిసిన భారీ వర్షం: ఉపశమనం పొందిన ప్రజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కల్లూరులో కురిసిన భారీ వర్షం: ఉపశమనం పొందిన ప్రజలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

కల్లూరు : సెప్టెంబర్ 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
కల్లూరు పట్టణం మరియు దాని పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం ప్రజలను పలకరించింది. కొద్దిసేపట్లోనే కుండపోతగా మారిన వాన ధాటికి ప్రధాన రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచి చెరువులను తలపించింది.
రాత్రి వేళ ప్రయాణాలు సాగిస్తున్న ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు, పాదచారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న స్థానిక ప్రజలకు ఈ వర్షం పెను ఉపశమనాన్ని కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారడంతో పట్టణవాసులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *