పాలకుర్తి లోని వెలుగు పాఠశాల ను సందర్శించిన DM&HO డాక్టర్ వాణిశ్రీ
————————————————————————
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ రోజు DM&HO డా. వాణిశ్రీ మేడం గారు వైద్య సిబ్బందితో కలిసి పాలకుర్తి వెలుగు పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో సుమారు 400–500 మంది విద్యార్థులతో మాట్లాడి,వారికి ఎలుకలు కరిచిన గాయాలు, గుర్తులు గాని , జ్వరం గాని కనపడలేదు. వారితో DM&HO డా. వాణిశ్రీ మేడం మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అలాగే ఏవైనా అనుకోని సంఘటనలు/అసౌకర్యాలు ఎదురైనప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే తరగతి ఉపాధ్యాయులకు మరియు పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు.
అదేవిధంగా, ప్రభావితమైన విద్యార్థులందరికీ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ (Anti-Rabies Vaccination) డోసులను ఎటువంటి విరామం లేకుండా, పాఠశాలలోనే వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి చేయాలని పాలకుర్తి PHC వైద్య బృందాన్ని ఆదేశించారు.కిటికీలకు తలుపులకు ఎలాంటి క్రిమి కీటకాలు, ఎలుకలు, పాములు, తేళ్ళు, రాకుండా ఉండుటకు మెస్ దొర్లు బిగించాలి అని సూచించారు.
అలాగే, ప్రభావితమైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం దగ్గరగా పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యం మరియు క్షేమాన్ని నిర్ధారించాలని DM&HO మేడం గారు వైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం ఆఫీసర్డా. సిద్దార్థ రెడ్డి, వైద్యాధికారులు డా. స్వప్న, డా. జావేద్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.





