Tuesday, 29 September 2026
  • Home  
  • నూనెపల్లి అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జికి దీక్షలు
- నంద్యాల

నూనెపల్లి అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జికి దీక్షలు

నంద్యాల : నూనెపల్లి రైల్వే అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ నూనెపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. భగత్‌సింగ్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఉద్యమాన్ని ప్రారంభించారు.నూనెపల్లి ప్రాంతంలోని 10 వార్డులకు చెందిన సుమారు 40 వేల మంది, 30 గ్రామాల ప్రజలు రైల్వే ట్రాక్‌ దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పశువులు, వ్యవసాయ పనిముట్ల రాకపోకలకు కూడా తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జి కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదన్నారు.ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. రైల్వే శాఖ నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి సిద్ధంగా ఉందని, స్థల సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తామని నూనెపల్లి అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ శంకరయ్య, సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు మద్దతు ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.