Saturday, 19 September 2026
  • Home  
  • క్రీడలతో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందుతుంది కమాండెంట్ ఆనంద్ రెడ్డి
- కడప

క్రీడలతో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందుతుంది కమాండెంట్ ఆనంద్ రెడ్డి

మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఎస్సీ టీపీసీఎస్ ( ఏపీఎస్పీ ) 2025 బ్యాచ్‌కు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ –2026 ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి 11వ బెటాలియన్‌ కమాండెంట్‌ కె. ఆనందరెడ్డి, ఎస్పీ ( ఎన్.సి ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆయన బహుమతులు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ కె. ఆనందరెడ్డి మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందికి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వ భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా నిర్వహించే క్రీడా పోటీలు సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడతాయని అన్నారు. విజేతలతో పాటు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.స్పోర్ట్స్, గేమ్ మీట్లో భాగంగా 100, 200, 400 మీటర్ల పరుగు, క్రికెట్‌, వాలీబాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, హ్యామర్‌ త్రో, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ పోటీల్లో ఎస్సీ టీపీసీఎస్ ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పోటీలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.ముగింపు కార్యక్రమంలో క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరచాలని కమాండెంట్‌ ఆకాంక్షించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు పి. రాజశేఖర్‌, కె. వెంకటప్ప, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు,11వ బెటాలియన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఎస్సీ టీపీసీఎస్ ( ఏపీఎస్పీ ) 2025 బ్యాచ్‌కు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ –2026 ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి 11వ బెటాలియన్‌ కమాండెంట్‌ కె. ఆనందరెడ్డి, ఎస్పీ ( ఎన్.సి ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆయన బహుమతులు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా కమాండెంట్‌ కె. ఆనందరెడ్డి మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందికి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వ భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా నిర్వహించే క్రీడా పోటీలు సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడతాయని అన్నారు. విజేతలతో పాటు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.స్పోర్ట్స్, గేమ్ మీట్లో భాగంగా 100, 200, 400 మీటర్ల పరుగు, క్రికెట్‌, వాలీబాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, హ్యామర్‌ త్రో, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ పోటీల్లో ఎస్సీ టీపీసీఎస్ ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పోటీలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.ముగింపు కార్యక్రమంలో క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరచాలని కమాండెంట్‌ ఆకాంక్షించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు పి. రాజశేఖర్‌, కె. వెంకటప్ప, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు,11వ బెటాలియన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.