ఉదయగిరి: BRICS కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో మెడికల్, OPD సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ టాగోర్ పాల్గొని సిబ్బందికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పోషకాహారం తీసుకోవడం, మంచి జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు ఆరోగ్య సూచనలు అందించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సమాచారం: DM, ఉదయగిరి
