Friday, 18 September 2026
  • Home  
  • ఖానాపూర్ మండలంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన ..బీజేపీ ఖానాపూర్ మండల అధ్యక్షుడు రాధారపు అశోక్..
- వరంగల్

ఖానాపూర్ మండలంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన ..బీజేపీ ఖానాపూర్ మండల అధ్యక్షుడు రాధారపు అశోక్..

ఖానాపురం మండల పున్నమి ప్రతినిధి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ఖానాపూర్ బీజేపీ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఖానాపూర్ మండల అధ్యక్షుడు రాధారపు అశోక్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధారపు అశోక్ గారు మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన కీలకమైన రోజని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థవంతమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, విముక్తి లభించాయని గుర్తుచేశారు. అమరవీరుల పోరాట పటిమను, త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశ సమైక్యత, అఖండత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జల్లి మధు, అబోతు రాజు, కలకోటి సహాదేవ్, ఖలీల్ షైక్, ఈసం లక్ష్మి నారాయణ, వేల్పుల చంద్ర శేఖర్, బానోత్ అనిల్, అజ్మీరా రమేష్, మల్లారెడ్డి, మండవ నరేష్, శ్రీరాంమోజు సతీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖానాపురం మండల పున్నమి ప్రతినిధి.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ఖానాపూర్ బీజేపీ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఖానాపూర్ మండల అధ్యక్షుడు రాధారపు అశోక్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాధారపు అశోక్ గారు మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన కీలకమైన రోజని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థవంతమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, విముక్తి లభించాయని గుర్తుచేశారు. అమరవీరుల పోరాట పటిమను, త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
దేశ సమైక్యత, అఖండత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జల్లి మధు, అబోతు రాజు, కలకోటి సహాదేవ్, ఖలీల్ షైక్, ఈసం లక్ష్మి నారాయణ, వేల్పుల చంద్ర శేఖర్, బానోత్ అనిల్, అజ్మీరా రమేష్, మల్లారెడ్డి, మండవ నరేష్, శ్రీరాంమోజు సతీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.