Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*బాలయోగి సేవలు చిరస్మరణీయం* : *కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*బాలయోగి సేవలు చిరస్మరణీయం* : *కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు*

వార్త ముఖ్యాంశాలు

  • ​కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్) ప్రజా సంక్షేమం,ప్రాంతీయ అభివృద్ధికి మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి చేసిన కృషి ఎప్పటికీ ఆదర్శనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు (వెంకటేశ్వరరావు) కొనియాడారు.గురువారం కాకినాడ జగన్నాథపురం యానం రోడ్డులోని బాలయోగి విగ్రహం వద్ద ఆయన…
  • ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
  • బాలయోగి ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు.ముఖ్యంగా కోనసీమతో పాటు మారుమూల ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు,తాగునీటి సదుపాయాలు వంటి శాశ్వత మౌలిక వసతుల కల్పనలో ఆయన చూపిన చొరవ చిరస్మరణీయమన్నారు.

​కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్)
ప్రజా సంక్షేమం,ప్రాంతీయ అభివృద్ధికి మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి చేసిన కృషి ఎప్పటికీ ఆదర్శనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు (వెంకటేశ్వరరావు) కొనియాడారు.గురువారం కాకినాడ జగన్నాథపురం యానం రోడ్డులోని బాలయోగి విగ్రహం వద్ద ఆయన 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.బొడ్డు దేవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబు, బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బాలయోగి ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు.ముఖ్యంగా కోనసీమతో పాటు మారుమూల ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు,తాగునీటి సదుపాయాలు వంటి శాశ్వత మౌలిక వసతుల కల్పనలో ఆయన చూపిన చొరవ చిరస్మరణీయమన్నారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేసిన ఆయన నాయకత్వ లక్షణాలు,నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
​ఈ వేడుకల్లో భాగంగా ఒక పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా సైకిల్‌ను పంపిణీ చేశారు.
​ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంబటి చిన్న, సబ్బతి ఫణీశ్వరరావు,జి. సత్తిబాబు, జక్కయ్య అప్పన్న, గరికిన పెద్దరాజు,జామి సత్తిరాజు,పెమ్మాడి శ్రీను, పాయసం గోపాలకృష్ణ,ఓలేటి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *