ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలం బుధరావుపేట, గ్రామంలోని ముస్లిం సోదరులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం పట్ల మస్జిద్-ఏ-అబూబకర్ అధ్యక్షులు, కాంగ్రెస్ యువ నాయకులు మహమ్మద్ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి బుధరావుపేట ముస్లింల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని మహమ్మద్ నజీర్ ఆకాంక్షించారు.
