ఖానాపురం పున్నమి ప్రతినిధి:
బుధరావుపేటలో కృతజ్ఞతలు తెలిపిన పెన్షన్‌దారులు
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్‌దారులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రభుత్వ కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లు ఎంతోమంది పేద కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి గ్రామ ప్రజలు, పెన్షన్‌దారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం పెన్షన్‌దారులు, గ్రామ ప్రజలు నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, వార్డు మెంబర్ వల్లపు యాదమ్మ కుమార్, కాంగ్రెస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్.కె. షరీఫ్, సీనియర్ నాయకులు పులి వెంకన్న, మరగని లింగయ్య, మహాలక్ష్మి వెంకన్న, సూరయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
