Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

ఎన్నికల విధులను అప్రమత్తంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల విధులను అప్రమత్తంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, నవంబర్ 28: జి.
  • మాడుగుల మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రోణంకి కూర్మనాథ్ ఐఏఎస్ పరిశీలించారు.
  • ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పోలింగ్ విధులు, నిబంధనలపై సూచనలు చేశారు.

పాడేరు, నవంబర్ 28: జి. మాడుగుల మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రోణంకి కూర్మనాథ్ ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పోలింగ్ విధులు, నిబంధనలపై సూచనలు చేశారు. పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా పరిశీలించి, కేటాయించిన కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా, వృద్ధులు, దివ్యాంగులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు, ఏడీ సర్వే ఈశ్వర్ దొర, మండల అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *