Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

నవోదయ ప్రవేశ పరీక్షకు 82 శాతం హాజరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నవోదయ ప్రవేశ పరీక్షకు 82 శాతం హాజరు

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, నవంబర్ 28: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష (JNVST) శనివారం ప్రశాంతంగా జరిగింది.
  • జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,443 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,190 మంది హాజరయ్యారు.
  • 82 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి.

పాడేరు, నవంబర్ 28: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష (JNVST) శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,443 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,190 మంది హాజరయ్యారు. 82 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. భానుమూర్తి రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, పరీక్షా నిబంధనల అమలును పర్యవేక్షించారు. అధికారుల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్ష ముగిసింది.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *