Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

నియోజకవర్గాల డీలిమిటేషన్లో అగనంపూడి నియోజకవర్గ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలి…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నియోజకవర్గాల డీలిమిటేషన్లో అగనంపూడి నియోజకవర్గ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలి…

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్, నవంబర్ 27, అగనంపూడి: అగనంపూడి సి డబ్ల్యూ సి లో జరిగిన కూటమి ప్రజా సంఘ నాయకులు సమావేశంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో ప్రజా పాలన సౌలభ్యం కొరకు 132వ రాజ్యాంగ సవరణ బిల్లు నవంబర్ 30 తేదీన…
  • 2011వ సంవత్సరం జనాభా ప్రతిపాదనపై నియోజకవర్గ విభజన లో భాగంగా జీవీఎంసీ అగనంపూడి జోన్, గాజువాక జూన్ లో ఉన్న 99, 100,101 వార్డులు పెందుర్తి జోన్ లో ఉన్న 113 వార్డులో కొంత భాగం కలిపి భౌగోళికంగా మరికొన్ని గ్రామాలు జతపరచి అగనంపూడి నియోజకవర్గము గా…
  • గాజువాక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్థానిక పుర ప్రజలు కు సౌలాభ్యంగా జీవీఎంసీ అగనంపూడి జోన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రవాణా కార్యాలయం, 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగినదనీ, అంతేకాకుండా ఇచ్చట హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి, బ్యాంకులు, ఆధార్ కేంద్రాలు, జిల్లా…

పున్నమి న్యూస్, నవంబర్ 27, అగనంపూడి:

అగనంపూడి సి డబ్ల్యూ సి లో జరిగిన కూటమి ప్రజా సంఘ నాయకులు సమావేశంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో ప్రజా పాలన సౌలభ్యం కొరకు 132వ రాజ్యాంగ సవరణ బిల్లు నవంబర్ 30 తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారనీ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళ రిజర్వేషన్ కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని భారత దేశ ప్రజాస్వామ్య సంపూర్ణ బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కీలక సంస్కరణలకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. 2011వ సంవత్సరం జనాభా ప్రతిపాదనపై నియోజకవర్గ విభజన లో భాగంగా జీవీఎంసీ అగనంపూడి జోన్, గాజువాక జూన్ లో ఉన్న 99, 100,101 వార్డులు పెందుర్తి జోన్ లో ఉన్న 113 వార్డులో కొంత భాగం కలిపి భౌగోళికంగా మరికొన్ని గ్రామాలు జతపరచి అగనంపూడి నియోజకవర్గము గా నియోజకవర్గాల డీలిమిటేషన్ లో ప్రతిపాదించలన కోరారు. గాజువాక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్థానిక పుర ప్రజలు కు సౌలాభ్యంగా జీవీఎంసీ అగనంపూడి జోన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రవాణా కార్యాలయం, 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగినదనీ, అంతేకాకుండా ఇచ్చట హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి, బ్యాంకులు, ఆధార్ కేంద్రాలు, జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర్లో దువ్వాడ రైల్వే స్టేషన్ కలిగి ఉన్నందున అగనంపూడి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తలారి వెంకటరమణ, సీనియర్ జనసేన పార్టీ నాయకులు మోటూరి వెంకటరమణ, బిజెపి నాయకులు అంగుళూరు ఈశ్వరరావు, విశాఖ జిల్లా లైన్స్ క్లబ్ చైర్ పర్సన్ కడిమి హనుమంతరావు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి చిన్ని పూర్ణ మరియు ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *