Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్యంతో మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ఎస్.కె.ఆర్. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆర్థిక చేయూత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనారోగ్యంతో మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ఎస్.కె.ఆర్. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆర్థిక చేయూత

వార్త ముఖ్యాంశాలు

  • గూడూరు:ఎస్.కె.ఆర్.
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ.
  • జువాలజీ చదువుతున్న విద్యార్థి ఎ.

గూడూరు:ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ. జువాలజీ చదువుతున్న విద్యార్థి ఎ. పవన్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడం ఎంతో బాధాకరమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్ ప్రసాద్ అన్నారు. కళాశాలలో విద్యాపరమైన, సాంస్కృతిక మరియు ఇతర కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటూ, అన్ని అంశాల్లో ముందుండే పవన్ అకాల మరణం కళాశాల కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.
పవన్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కలిసి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కిరణ్మయి తోడ్పాటుతో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సహాయ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు అధ్యాపకేతర సిబ్బంది కూడా భాగస్వాములై మానవతా దృక్పథంతో తమ వంతు సహాయం అందించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కుటుంబానికి ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచ్చిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవాభావం, మానవీయత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
పవన్ కుటుంబానికి కళాశాల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థి మృతి పట్ల కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *