వార్త ముఖ్యాంశాలు
- అధికారులకు కమిషనర్ వై.ఓ.
- నందన్ ఆదేశం నెల్లూరు, నవంబర్: నగర పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ భూములు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
- నందన్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశం
నెల్లూరు, నవంబర్: నగర పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ భూములు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో ఆయన వారాంతపు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ స్థలాలతో పాటు ఆర్అండ్బీ, ఇతర ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల పరిధిలో రోడ్ల ఆక్రమణలు, అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ఫంక్షనల్, ఐపీఎల్పీ పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని, డీపీఎంఎస్లో అవసరమైన సవరణల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించాలని ఆదేశించారు.అలాగే అసెట్ మేనేజ్మెంట్, నక్ష గ్రౌండ్ ట్రూతింగ్, డిజిటల్ డోర్ నంబర్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు పంపాలని తెలిపారు.ఈ సమీక్షలో అదనపు కమిషనర్ హిమబిందు, టీపీఓ సతీష్, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.