వార్త ముఖ్యాంశాలు
- సంగం: మండలంలోని తరుణవాయి సమీపంలో జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
- బుచ్చిరెడ్డిపాలెం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు, అనంతసాగరం నుంచి నెల్లూరు వైపు వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) రాములు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
సంగం: మండలంలోని తరుణవాయి సమీపంలో జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు, అనంతసాగరం నుంచి నెల్లూరు వైపు వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) రాములు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగాన్ని నియంత్రించుకోవడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరించాలని పేర్కొన్నారు.రాత్రి వేళల్లో సుదూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా సీసీ రోడ్లపై వాహనాలు జారిపోయే అవకాశం ఉందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను గమనించాలని, మలుపులు, కల్వర్టుల వద్ద వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని ఎంవీఐ రాములు సూచించారు.