Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎఎస్‌పేట: వైభవంగా ఫక్రుద్దీన్ బాబా గంధ మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎఎస్‌పేట: వైభవంగా ఫక్రుద్దీన్ బాబా గంధ మహోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • ఎఎస్‌పేట: అనుమసముద్రంపేట మండలంలోని ఎఎస్‌పేట గ్రామంలో వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ షా వలి అలియాస్ ఫక్రుద్దీన్ బాబా స్వాముల వారి గంధ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  • శనివారం రాత్రి ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు ఆరిఫ్ హుస్సేన్, ఆదిల్ హుస్సేన్, జావిద్ హుస్సేన్ తెలిపారు.మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గాను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
  • ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

ఎఎస్‌పేట: అనుమసముద్రంపేట మండలంలోని ఎఎస్‌పేట గ్రామంలో వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ షా వలి అలియాస్ ఫక్రుద్దీన్ బాబా స్వాముల వారి గంధ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం రాత్రి ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు ఆరిఫ్ హుస్సేన్, ఆదిల్ హుస్సేన్, జావిద్ హుస్సేన్ తెలిపారు.మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గాను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల కోసం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా స్వాముల వారి ఆశీస్సులు పొందాలని కోరారు.గంధ మహోత్సవం అనంతరం ఆదివారం దీపాలంకరణ, సోమవారం తహలీల్ ఫాతిహా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఎఎస్‌పేటలోని ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారి పెద్ద దర్గా గంధ మహోత్సవం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే వేడుకల్లో ఫక్రుద్దీన్ బాబా గంధ మహోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *