వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో నూతనంగా చేరిన బీఎస్సీ ఆనర్స్ వ్యవసాయ విద్యార్థులకు దీక్షారంభం కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి.
- గోపికృష్ణ మాట్లాడుతూ..
ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో నూతనంగా చేరిన బీఎస్సీ ఆనర్స్ వ్యవసాయ విద్యార్థులకు దీక్షారంభం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపికృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులకు కళాశాల విద్యా విధానం, క్రమశిక్షణ, వసతి గృహ నియమ నిబంధనలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.