ఖానాపురంపున్నమి ప్రతినిధి.ఖానాపురం మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీడీవో నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వసంత, ఎంపీడీవో , తహసీల్దార్ రమేష్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రైమరీ ఇన్స్పెక్టర్ నియామకంలో అనర్హులను ఎంపిక చేశారని ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో ఎంపిక జరిగిందని, ప్రస్తుత కమిటీ ప్రకటించిన విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు.
పాఠశాల అభివృద్ధి పనుల సమాచారాన్ని సర్పంచులకు ముందే ఇవ్వాలని రమేష్ కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సమాచారం ఇవ్వడం లేదని దాసరి రమేష్, ధర్మారావుపేట సర్పంచ్ మాడ్రాజు వెంకన్న అన్నారు.
కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలని, రైతు బీమా పునరుద్ధరించాలని, చిరు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని సర్పంచులు కోరారు.
మహిళా సంఘాల రుణాల మంజూరులో కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారని, అర్హులైన పేదలకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు.
