వార్త ముఖ్యాంశాలు
- 26/11 ముంబై ఉగ్ర దాడుల సమయంలో ఓ నర్స్ చూపిన తెగువ,మానవత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
- కామా ఆసుపత్రిలో తూటాల వర్షం కురిపిస్తుండగా అందరు వణికిపోతుంటే నర్స్ అంజలి కుళ్తే మాత్రం తన కర్తవ్యాన్ని వదల్లేదు.
- 20 మంది గర్భిణీలను ప్రాణాలకు తెగించి కాపాడారు.
26/11 ముంబై ఉగ్ర దాడుల సమయంలో ఓ నర్స్ చూపిన తెగువ,మానవత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కామా ఆసుపత్రిలో తూటాల వర్షం కురిపిస్తుండగా అందరు వణికిపోతుంటే నర్స్ అంజలి కుళ్తే మాత్రం తన కర్తవ్యాన్ని వదల్లేదు. 20 మంది గర్భిణీలను ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆ సమయంలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రాగా ప్రసవం కూడా చేశారు. ఆ తర్వాత ఉగ్రవాది కసబ్ ను కోర్ట్ లో గుర్తు పట్టి అతనికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు.