వార్త ముఖ్యాంశాలు
- పాడేరు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ టి.
- నిశాంతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
- రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
పాడేరు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించాలన్నారు. అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన