వార్త ముఖ్యాంశాలు
- తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్ కుమార్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు.
- హైదరాబాద్‌లో రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగింది.
- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఇరువురు కూలంకషంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్ కుమార్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఇరువురు కూలంకషంగా చర్చించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలను రాజగోపాల్ రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలను వివరించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్