Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

శోంఠ్యం స్టేజ్–1 పరిధిలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ! .. నాలుగు గ్రామ పంచాయతీల్లో 190 నామినేషన్లు దాఖలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శోంఠ్యం స్టేజ్–1 పరిధిలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ! .. నాలుగు గ్రామ పంచాయతీల్లో 190 నామినేషన్లు దాఖలు

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 23:: శోంఠ్యం స్టేజ్–1 పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందని రిటర్నింగ్ అధికారి **P.V.S.
  • ఆంజనేయులు** తెలిపారు.
  • గండిగుండం, మామిడిలోవ, రామవరం, శోంఠ్యం గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 190 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 23::

శోంఠ్యం స్టేజ్–1 పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందని రిటర్నింగ్ అధికారి **P.V.S. ఆంజనేయులు** తెలిపారు. గండిగుండం, మామిడిలోవ, రామవరం, శోంఠ్యం గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 190 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

గ్రామాల వారీగా నామినేషన్ల వివరాలు పరిశీలిస్తే..

– **గండిగుండం:** సర్పంచ్ 4, వార్డు మెంబర్లు 39.
– **మామిడిలోవ:** సర్పంచ్ 9, వార్డు మెంబర్లు 36.
– **రామవరం:** సర్పంచ్ 5, వార్డు మెంబర్లు 30.
– **శోంఠ్యం:** సర్పంచ్ 16, వార్డు మెంబర్లు 51.

మొత్తంగా నాలుగు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 34, వార్డు మెంబర్ స్థానాలకు 156 కలిపి 190 నామినేషన్లు నమోదయ్యాయి.

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ప్రక్రియ పూర్తయిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

ఈ నామినేషన్ల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అభ్యర్థులకు, ప్రజలకు రిటర్నింగ్ అధికారి **P.V.S. ఆంజనేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.** అందరి సహకారం వల్లే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *