వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
బ్రేకింగ్ న్యూస్
Date :23-11-2026
నామినేషన్ పత్రాలు తొలగిస్తున్నారన్న సమాచారంతో భారీగా చేరుకున్న అభ్యర్థులు, గ్రామ ప్రజలు.
దుత్తలూరు, నవంబర్ 23-11-2026
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సచివాలయం వద్ద సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ పత్రాలను ఉపసంహారణ చేస్తున్నారని తెలియడంతో సర్పంచ్ అభ్యర్థులు, వైసీపీ కార్యకర్తలు సచివాలయం వద్దకు భారీగా చేరుకున్నారు.
దీంతో అక్కడ ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. నందిపాడు సర్పంచ్ అభ్యర్థి మండ్ల శివతో పాటు, దుత్తలూరు వైసీపీ మండల కన్వీనర్ వాసుదేవ రెడ్డి పలువురు వైసీపీ కార్యకర్తలు,గ్రామస్తులు సచివాలయం వద్దకు చేరుకుని రిటర్నింగ్అ అధికారి లేకుండా సచివాలయం ఎందుకు తెరిచారు అంటూ అక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించారు.
సమాచారం అందుకున్న ఉదయగిరి సీఐ అంకమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
నామినేషన్ పత్రాల తొలగింపు అంశంపై గ్రామంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై అధికారుల వివరణ కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
Uploaded Video:



Uploaded Video:
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్