వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం సమీపంలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న పరమేశ్వర స్వామికి సోమవారం చతుర్దశి సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు.
- పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు.
- ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన చుండ్రు రాజా, భారతి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.
ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం సమీపంలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న పరమేశ్వర స్వామికి సోమవారం చతుర్దశి సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన చుండ్రు రాజా, భారతి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అనంతరం అర్చకులు స్వామివారికి పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు.