*ప్రజల ఆశీర్వాదమే కొండంత అండ…*
*సేవ చేసేందుకు వచ్చా.. ఆదరించండి!*
*13వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా…*
*ప్రచారంలో అడుగడుగునా నీరాజనం…*
*ద్వారకా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎస్.వి. సుధాకరరావు తనయుడు సూరనేని నివృత్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం*
*ప్రజల నుండి విశేష స్పందన…*
*మైలవరం,నవంబర్:-19*
_మైలవరం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో 13వ వార్డు కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నపురెడ్డి జమలయ్య దూకుడు పెంచారు. వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు._ _ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ద్వారకా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎస్.వి. సుధాకరరావు తనయుడు సూరనేని నివృత్ రావుతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ నీరాజనాలు అందించారు._ _మహిళలు, యువకులు, పెద్దలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటూ తమ మద్దతు ప్రకటించడం విశేషం. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో అభ్యర్థి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు._
_ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ.. పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు._
_13వ వార్డు ప్రజలు తనపై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపిస్తే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సహకారంతో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు._
_వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు._
_ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తానని, సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని జమలయ్య భరోసా ఇచ్చారు._
_ఎన్నికల్లో తనకు లభించే ప్రతి ఓటును బాధ్యతగా భావించి వార్డు అభివృద్ధికి అంకితమవుతానని పేర్కొంటూ, మీ అమూల్యమైన ఓటుతో సర్పంచ్ అభ్యర్థి నివృత్ రావు గారిని తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలే తనకు కొండంత బలమని జమలయ్య తెలిపారు._

