వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు, నవంబర్ (పున్నమి): నెల్లూరు నగరంలోని 58వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన అల్ హజ్ షేక్ కరీముల్లాకు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు అభినందనలు తెలిపారు.శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జామియా మసీదులో ఆయన ప్రత్యేక నమాజ్ నిర్వహించారు.
- అనంతరం ఇమామ్, మౌజన్, మసీదు కమిటీ సభ్యులు, మత పెద్దలు, ముస్లిం ప్రముఖులు కరీముల్లాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
- ప్రజల ఆదరాభిమానాలతో కార్పొరేటర్‌గా విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముబారక్ హో అంటూ అభినందించి, ప్రజలకు మంచి సేవలు అందిస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
నెల్లూరు, నవంబర్ (పున్నమి): నెల్లూరు నగరంలోని 58వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన అల్ హజ్ షేక్ కరీముల్లాకు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు అభినందనలు తెలిపారు.శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జామియా మసీదులో ఆయన ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. అనంతరం ఇమామ్, మౌజన్, మసీదు కమిటీ సభ్యులు, మత పెద్దలు, ముస్లిం ప్రముఖులు కరీముల్లాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆదరాభిమానాలతో కార్పొరేటర్‌గా విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముబారక్ హో అంటూ అభినందించి, ప్రజలకు మంచి సేవలు అందిస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహకారం, డివిజన్ ప్రజల మద్దతుతో ఈ విజయం సాధించినట్లు కరీముల్లా అనుచరులు పేర్కొన్నారు.