వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగణపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
- మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి తమ అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
- ఈ క్రమంలో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగణపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి తమ అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ఇరువురు నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం వారిని నామినేషన్ కేంద్రం నుంచి పంపించడంతో కొద్దిసేపు కొనసాగిన వివాదం సద్దుమణిగింది.