Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోస్ట్ 7 హోటల్‌పై మున్సిపల్ హెల్త్ దాడులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోస్ట్ 7 హోటల్‌పై మున్సిపల్ హెల్త్ దాడులు

వార్త ముఖ్యాంశాలు

  • – కుళ్లిన మాంసం స్వాధీనం నెల్లూరు నగరంలోని రోస్ట్ 7 హోటల్‌పై మున్సిపల్ హెల్త్ అధికారి ఓ.
  • దినేష్ శుక్రవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
  • హోటల్‌లోని డీప్ ఫ్రిడ్జ్‌లు తదితరాలను పరిశీలించగా, కుళ్లిన మాంసం, నిల్వ ఉన్న ఆహారాలను కనుగొని స్వాధీనం చేసుకున్నారు.

– కుళ్లిన మాంసం స్వాధీనం
నెల్లూరు నగరంలోని రోస్ట్ 7 హోటల్‌పై మున్సిపల్ హెల్త్ అధికారి ఓ. దినేష్ శుక్రవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. హోటల్‌లోని డీప్ ఫ్రిడ్జ్‌లు తదితరాలను పరిశీలించగా, కుళ్లిన మాంసం, నిల్వ ఉన్న ఆహారాలను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. రోస్ట్ 7 హోటల్‌లో నిల్వ ఉన్న ఆహారాలను వండి వడ్డిస్తున్నారన్న సమాచారం పక్కాగా రావడంతోనే ఎంహెచ్‌ఓ ఈ దాడులు నిర్వహించారు. సంబంధిత హోటల్ యజమానికి రూ.50 వేల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా ఎంహెచ్‌ఓ దినేష్ మాట్లాడుతూ, నెల్లూరు నగరంలోని హోటళ్లలో నిల్వ ఉన్న ఆహారాలను వండి వడ్డించరాదని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తాజా మాంసం, తాజా ఆహార పదార్థాలనే వినియోగదారులకు సరఫరా చేయాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని దాడులు, తనిఖీలు, పరిశీలనలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా నిల్వ ఉన్న మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి, దాన్ని వినియోగదారులకు అందజేస్తే భారీ జరిమానాలు తప్పవని కూడా హెచ్చరించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *