వార్త ముఖ్యాంశాలు
- ప్రభువుల పాలన పోయి ప్రజా పాలన వచ్చినా మారలే పేద బ్రతుకులు మారలే..!
- అరాచక శక్తులు అణగారిన బ్రతుకులను కోయగా, ఉచకోత కోయగా రక్షక భటుల సాక్షిగా..!పుడమిపై నీ రక్తం చిందగా..!
- అయ్యో..!అయ్యయ్యో..!
ప్రభువుల పాలన పోయి
ప్రజా పాలన వచ్చినా
మారలే పేద బ్రతుకులు మారలే..!
అరాచక శక్తులు అణగారిన బ్రతుకులను
కోయగా, ఉచకోత కోయగా
రక్షక భటుల సాక్షిగా..!పుడమిపై నీ రక్తం చిందగా..!
అయ్యో..!అయ్యయ్యో..!
కాలే కడుపుల కష్టాలతో, నీ కన్నీళ్లనే దిగమింగి
కోటలు,పేటలు కడితివి
ఈ కుబేర రాజ్యంలో..!ఈ అపర కుబేర రాజ్యంలో..!
ఏడ బ్రతకగలవు..? ఏడ నిలువ గలవు..?
ఆ పేదవాడి గుడిసె రక్షణకు పోరాటపు ‘గుండు’ మూగబోయరా..!
అందుకే కదలాలి చీమల ‘దండు ‘
తీయాలి పాలకుల ‘బెండు ‘—-కవి, రచయిత –కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, నెల్లూరు )
నీ కన్నీళ్లు అనే దిగమింగి కోటలు పేటలు కడితివి ఈ కుబేర రాజ్యంలో ఈ అపరకు వీర రాజ్యాంగంలో ఏడ బ్రతకగలవు యాడ నిలవ గలవు ఆ పేదవాడి గుండె