వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి రూరల్ (వరికుంటపాడు), నవంబరు: వరికుంటపాడు మండలం నార్త్ కృష్ణంరాజుపల్లిలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ మోటార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
- ఈ ఘటనలో మోటారుతో పాటు పైపులైన్, స్టార్టర్లు కూడా కాలిపోయాయి.గ్రామానికి చెందిన ఉలిసి నారాయణరాజు తనకున్న ఆరెకరాల వ్యవసాయ భూమిలో బత్తాయి, వరి, బంతి పంటలను సాగు చేస్తున్నారు.
- ఎప్పటిలాగే గురువారం పొలానికి వెళ్లి మోటార్ ద్వారా పంటలకు నీరు పెట్టి ఇంటికి తిరిగి వెళ్లారు.
ఉదయగిరి రూరల్ (వరికుంటపాడు), నవంబరు: వరికుంటపాడు మండలం నార్త్ కృష్ణంరాజుపల్లిలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ మోటార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మోటారుతో పాటు పైపులైన్, స్టార్టర్లు కూడా కాలిపోయాయి.గ్రామానికి చెందిన ఉలిసి నారాయణరాజు తనకున్న ఆరెకరాల వ్యవసాయ భూమిలో బత్తాయి, వరి, బంతి పంటలను సాగు చేస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం పొలానికి వెళ్లి మోటార్ ద్వారా పంటలకు నీరు పెట్టి ఇంటికి తిరిగి వెళ్లారు. అనంతరం మళ్లీ పొలానికి వెళ్లి చూడగా వ్యవసాయ మోటార్‌తో పాటు ఇతర పరికరాలు పూర్తిగా దగ్ధమై కనిపించాయి.
దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు జరిగిన విషయాన్ని గ్రామస్థుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తున్న ఎనిమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మోటార్, ఇతర పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.30 వేల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు పేర్కొన్నారు.