వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు , నవంబరు: నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
- నాలుగో నంబరు ప్లాట్‌ఫాంపై సుమారు 60 నుంచి 65 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతిచెందాడు.
- రైల్వే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.మృతుడి ఎత్తు సుమారు 5.4 అడుగులు ఉండగా, చామనచాయ రంగు కలిగి ఉన్నాడు.
నెల్లూరు , నవంబరు: నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగో నంబరు ప్లాట్‌ఫాంపై సుమారు 60 నుంచి 65 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతిచెందాడు. రైల్వే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.మృతుడి ఎత్తు సుమారు 5.4 అడుగులు ఉండగా, చామనచాయ రంగు కలిగి ఉన్నాడు. మృతదేహంపై ఎరుపు రంగు షార్ట్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడికి సంబంధించిన ఇతర వివరాలు లభించలేదు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ ఎన్. హరిచందన కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.మృతుడి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు 9247575628 నంబరును సంప్రదించాలని ఎస్ఐ కోరారు.