ఉదయగిరి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు గురువారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. సర్పంచ్ స్థానాలకు 61, వార్డు సభ్యుల స్థానాలకు 117 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి. సుకుమార్ తెలిపారు. గండిపాలెం, గంగులవారి చెరువుపల్లి పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కో నామినేషన్ దాఖలైంది. నేలటూరు, దాసరిపల్లి పంచాయతీల్లో ఒక్క వార్డు సభ్యుడి నామినేషన్ కూడా దాఖలు కాలేదని వెల్లడించారు.
