## పద్మనాభం కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రవి వ్యాస్
విశాఖపట్నం జిల్లా,పద్మనాభం, నవంబర్ 19 (పున్నమి ప్రతినిధి): నవంబర్ 19::
బాలికల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోందని ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రవి వ్యాస్ పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని కేజీబీవీ పద్మనాభం పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ కార్యక్రమాలు, క్యాడెట్ల శిక్షణ, పరేడ్, క్రమశిక్షణతో పాటు వివిధ కార్యకలాపాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి ఎన్సీసీ ద్వారా కలిగే ప్రయోజనాలను, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవాభావం ప్రాముఖ్యతను వివరించారు.
విద్యార్థినులు చదువుతోపాటు ఎన్సీసీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కె. గ్రేస్ లిల్లీ మాట్లాడుతూ.. కల్నల్ రవి వ్యాస్ పాఠశాలను సందర్శించడం విద్యార్థినుల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపారు. ఆయన అందించిన సూచనలు విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఎన్ఓ దేవి, ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్