వార్త ముఖ్యాంశాలు
- రూ.1.03 కోట్లతో సర్పంచి పదవుల ఏకగ్రీవ నిర్ణయం..
- గ్రామాభివృద్ధికి నిధులు ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 19:: ఆనందపురం మండలంలో రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
- శిర్లపాలెం, గొట్టిపల్లి గ్రామాల్లో సర్పంచి పదవుల విషయంలో గ్రామస్థులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
రూ.1.03 కోట్లతో సర్పంచి పదవుల ఏకగ్రీవ నిర్ణయం.. గ్రామాభివృద్ధికి నిధులు
ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 19::
ఆనందపురం మండలంలో రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. శిర్లపాలెం, గొట్టిపల్లి గ్రామాల్లో సర్పంచి పదవుల విషయంలో గ్రామస్థులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
శిర్లపాలెం గ్రామంలో సర్పంచి పదవికి కోరాడ గౌరిని రూ.35 లక్షలకు ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక గొట్టిపల్లి గ్రామంలో ఇల్లాపు మహేశ్ రూ.68 లక్షలకు వేలంపాటలో పదవిని దక్కించుకున్నారు. అయితే ఆ గ్రామంలో సర్పంచి స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయన భార్య రమాదేవి సర్పంచిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ రెండు గ్రామాల నుంచి సమకూరిన మొత్తం రూ.1.03 కోట్లను గ్రామాభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని గ్రామపెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల పోటీకి దూరంగా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం, గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.
ఒక్కో గ్రామం.. ఒక్కో నిర్ణయం.. లక్ష్యం మాత్రం గ్రామాభివృద్ధి!
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్