Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో శ్రీనివాసరావుకు రెండు స్వర్ణాలు, ఒక రజతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో శ్రీనివాసరావుకు రెండు స్వర్ణాలు, ఒక రజతం

వార్త ముఖ్యాంశాలు

  • 📰 పత్రికా ప్రకటన ### రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో శ్రీనివాసరావుకు రెండు స్వర్ణాలు, ఒక రజతం నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించిన 46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలలో 45+ వయస్సు విభాగానికి చెందిన ఎస్.
  • సార్ శ్రీనివాసరావు అద్భుత ప్రతిభ కనబరిచారు.
  • 5 కిలోమీటర్ల నడక పోటీలో స్వర్ణ పతకం, 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం, 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించి మొత్తం మూడు పతకాలు కైవసం చేసుకున్నారు.

📰 పత్రికా ప్రకటన

### రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో శ్రీనివాసరావుకు రెండు స్వర్ణాలు, ఒక రజతం

నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించిన 46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలలో 45+ వయస్సు విభాగానికి చెందిన ఎస్. సార్ శ్రీనివాసరావు అద్భుత ప్రతిభ కనబరిచారు. 5 కిలోమీటర్ల నడక పోటీలో స్వర్ణ పతకం, 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం, 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించి మొత్తం మూడు పతకాలు కైవసం చేసుకున్నారు.

ఆయన సాధించిన ఈ విజయం విశాఖపట్నం క్రీడాకారులకు గర్వకారణమని, నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించారని వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ విశాఖపట్నం (VAAV) కార్యదర్శి ఎల్.వి. సుధాకర్ తెలిపారు. శ్రీనివాసరావుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇట్లు, L.V. సుధాకర్ కార్యదర్శి Veteran Athletics Association Visakhapatnam (VAAV) 🌹🏆

Leave a comment

Your email address will not be published. Required fields are marked *