Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

12 రివార్డులతో సౌత్ క్రైమ్ బ్రాంచ్‌కు సీపీ అభినందనలు! నేర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
12 రివార్డులతో సౌత్ క్రైమ్ బ్రాంచ్‌కు సీపీ అభినందనలు! నేర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపు..

నేర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపు.. సిబ్బంది సమిష్టి కృషికి ప్రశంసలు

గాజువాక, నవంబర్ 18 (పున్నమి ప్రతినిధి):

నేర పరిశోధన, చోరీ కేసుల ఛేదనలో విశేష ప్రతిభ కనబరిచిన విశాఖపట్నం సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభించింది. గత నెల రోజులుగా పలు ఆస్తి నేరాలు, హౌస్ బ్రేకింగ్, దొంగతనం కేసులను సాంకేతిక పరిజ్ఞానం, పక్కా సమాచారంతో ఛేదించి, నిందితులను పట్టుకోవడంతో పాటు చోరీకి గురైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను రికవరీ చేయడంలో సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

ఈ కృషిని గుర్తించిన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఐపీఎస్ క్రైమ్ మీటింగ్‌లో సిబ్బందికి మొత్తం 12 రివార్డులు అందజేసి అభినందించారు.

సౌత్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు పర్యవేక్షణలో ఎస్‌ఐలు హరికృష్ణ, సత్తిబాబు, సాంబశివరావు, స్పెషల్ టీమ్ సిబ్బంది తులసి, శేఖర్, లక్ష్మణ్, రాంబాబు తదితరులు సమిష్టిగా కృషి చేశారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు మాట్లాడుతూ.. ఈ 12 రివార్డులు తమ బృందం అంకితభావానికి లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై మర్యాదపూర్వకంగా స్పందిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం, నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేయడం తమ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమం లో కమిషనర్‌తో పాటు డీసీపీ (క్రైమ్) లతా మాధురి, ఏడీసీపీ (క్రైమ్) ఎన్. రమ్య, ఏసీపీ వెంకటరావు అందించిన మార్గదర్శకత్వం, సహకారంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని సిబ్బంది తెలిపారు.

12 రివార్డులతో సౌత్ క్రైమ్ బ్రాంచ్‌కు సీపీ అభినందనలు! నేర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపు..

12 రివార్డులతో సౌత్ క్రైమ్ బ్రాంచ్‌కు సీపీ అభినందనలు! నేర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపు..

12 రివార్డులతో సౌత్ క్రైమ్ బ్రాంచ్‌కు సీపీ అభినందనలు! నేర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *