Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొలంలో రోటోవేటర్ కిందపడి యువకుడి దుర్మరణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొలంలో రోటోవేటర్ కిందపడి యువకుడి దుర్మరణం

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి: మండలంలోని నాగసముద్రం బీసీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
  • గ్రామానికి చెందిన పల్లాపు పెద్ద తిరుపతయ్య కుమారుడు నవీన్ (26) పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా రోటోవేటర్‌ చెడిపోయింది.
  • దానిని బాగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు రోటోవేటర్‌ జారి అతనిపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

కలిగిరి: మండలంలోని నాగసముద్రం బీసీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లాపు పెద్ద తిరుపతయ్య కుమారుడు నవీన్ (26) పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా రోటోవేటర్‌ చెడిపోయింది. దానిని బాగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు రోటోవేటర్‌ జారి అతనిపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై ఎస్‌ఐ సయ్యద్ లతీఫున్నిసా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *