Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో భూముల రీ-సర్వేపై ఆర్డీవో పావని పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో భూముల రీ-సర్వేపై ఆర్డీవో పావని పరిశీలన

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరులో భూముల రీ-సర్వే పనులపై ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన ఆత్మకూరు, నవంబరు 18 (పున్నమి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి.
  • పావని బుధవారం క్షేత్రస్థాయిలో,పరిశీలించారు.
  • పొలాల వద్ద సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది పనితీరును సమీక్షించి, సర్వే పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రీ-సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, భూముల వివరాల నమోదు ద్వారా చేకూరే లబ్ధిని రైతులకు వివరించారు.

ఆత్మకూరులో భూముల రీ-సర్వే పనులపై ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన

ఆత్మకూరు, నవంబరు 18 (పున్నమి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి. పావని బుధవారం క్షేత్రస్థాయిలో,పరిశీలించారు. పొలాల వద్ద సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది పనితీరును సమీక్షించి, సర్వే పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రీ-సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, భూముల వివరాల నమోదు ద్వారా చేకూరే లబ్ధిని రైతులకు వివరించారు. సర్వే సమయంలో ఏవైనా సమస్యలు లేదా అభ్యంతరాలు ఎదురైతే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *