Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం గణపవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అభ్యర్థి బల్లారెడ్డి మానస బల్లారెడ్డి మానస

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మండలం గణపవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అభ్యర్థి బల్లారెడ్డి మానస బల్లారెడ్డి మానస

గణపవరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. మానస హామీ!

మౌలిక సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా.. ప్రజల ఆశీస్సులతో ముందుకు

మైలవరం: మండలంలోని గణపవరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థి బొల్లారెడ్డి మానస ప్రజల్లోకి వెళ్తున్నారు. బొల్లారెడ్డి యువరాజు రెడ్డి మద్దతుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు. గ్రామంలో ప్రధానంగా నెలకొన్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రతి వీధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు కృషి చేస్తామని వివరిస్తున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తామని పేర్కొంటూ, గణపవరం భవిష్యత్తు కోసం తమకు ఒక అవకాశం కల్పించి ఆదరించాలని మానస ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.

మైలవరం మండలం గణపవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అభ్యర్థి బల్లారెడ్డి మానస బల్లారెడ్డి మానస

మైలవరం మండలం గణపవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అభ్యర్థి బల్లారెడ్డి మానస బల్లారెడ్డి మానస

Leave a comment

Your email address will not be published. Required fields are marked *