Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

తెలంగాణ ఆడపడుచులకు భర్తలు లేకున్నా పర్వాలేదా..? కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలంటారా!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణ ఆడపడుచులకు భర్తలు లేకున్నా పర్వాలేదా..? కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలంటారా!

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

తెలంగాణ ఆడపడుచులకు భర్తలు లేకున్నా పర్వాలేదా..? కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలంటారా!

మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎంపీ పోరిక బలరాం నాయక్ వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ బంధాలను ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం?

మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఆడపడుచులకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవం, కుటుంబ విలువలు, రాజకీయ నాయకుల బాధ్యతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న మహిళలకు వృద్ధాప్య పెన్షన్లు, ఉచిత బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించే క్రమంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ వాటిని వివరించే క్రమంలో మహిళల వైవాహిక జీవితాన్ని, భర్తలతో ఉన్న కుటుంబ బంధాలను రాజకీయ వ్యాఖ్యలకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

మహిళలకు ప్రభుత్వం అందించే పింఛన్లు, రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రభుత్వ బాధ్యతలో భాగం. అవి ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగత ఆస్తులు కావు. ప్రజలు చెల్లించే పన్నులు, ప్రభుత్వ వనరుల ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలు ప్రజలకు హక్కుగా అందాలి. ప్రజాప్రతినిధులు వాటి అమలుపై దృష్టి సారించాలి.

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం ఎంత ముఖ్యమో, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. రాజకీయ పార్టీలపై అభిమానం ఉండవచ్చు.. ప్రభుత్వ పథకాలపై విశ్వాసం ఉండవచ్చు.. కానీ కుటుంబ బంధాలను రాజకీయాలతో పోల్చడం సరైన రాజకీయ సంస్కృతేనా? అన్నది ప్రజలు ఆలోచించాల్సిన అంశం.

మహిళా సాధికారత గురించి మాట్లాడే నాయకులు మహిళలను గౌరవించే భాషను కూడా ఉపయోగించాలి. సంక్షేమ పథకాల పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవడం కంటే, అర్హులైన ప్రతి మహిళకు ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందేలా చూడటం ప్రజాప్రతినిధుల అసలైన బాధ్యత. ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

పున్నమి రిపోర్టర్
భుక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

Uploaded Video:

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *