Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

స్టీల్ ప్లాంట్ కార్మిక సమస్యలపై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌కు ఐఎన్టియుసి నాయకుల వినతిపత్రం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్టీల్ ప్లాంట్ కార్మిక సమస్యలపై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌కు ఐఎన్టియుసి నాయకుల వినతిపత్రం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్, విశాఖపట్నం, నవంబర్ 16: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్‌లో ఉన్న కార్మిక ప్రయోజనాలు, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై జాతీయ ఐఎన్టియుసి సీనియర్ నాయకులు, జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు, స్టీల్ ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ డిప్యూటీ చీఫ్…
  • ఈ సందర్భంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమవుతున్న తీరును, కార్మికులకు అందాల్సిన హక్కులు మరియు ప్రయోజనాలు పక్కదారి పడుతున్న అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
  • అదేవిధంగా కార్మికుల నిజమైన అభిప్రాయాలను ప్రతిబింబించేలా, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

పున్నమి న్యూస్, విశాఖపట్నం, నవంబర్ 16:
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్‌లో ఉన్న కార్మిక ప్రయోజనాలు, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై జాతీయ ఐఎన్టియుసి సీనియర్ నాయకులు, జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు, స్టీల్ ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ ప్రసాద్ తో సమావేశమై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమవుతున్న తీరును, కార్మికులకు అందాల్సిన హక్కులు మరియు ప్రయోజనాలు పక్కదారి పడుతున్న అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా కార్మికుల నిజమైన అభిప్రాయాలను ప్రతిబింబించేలా, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి బి. నాగభూషణం, డాక్‌యార్డు ఐఎన్టియుసి సీనియర్ నాయకులు మర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *