Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మూడో రోజుకు చేరుకున్న వారోత్సవాలు మైలవరం గ్రంధాలయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మూడో రోజుకు చేరుకున్న వారోత్సవాలు మైలవరం గ్రంధాలయం

59వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ది. 16.11.2026న మైలవరం శాఖా గ్రంధాలయం నందు కవి సమ్మేళనం,రచయితల సందేశం అనే కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన T. వెంకటేశ్వరరావు గారు ( విశ్రాంతి తెలుగుఉపాధ్యాయులు ), పాటిబండ్ల. శ్రీనివాసరావు గారు(S. V. R. G. N. R. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు), లింగాల ఆనంద నిరీక్షణ కుమార్ గారు మరియు శామ్యూల్.ఆనంద్ గారు తెలుగు కవులను, రచయితలను స్మరించుకుంటూ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా టి.వెంకటేశ్వరావు గారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యం అంటేనే వేల సంవత్సరాల చరిత్ర,భక్తి,విప్లవం అన్నీ కలిసిన ఒక గొప్ప ప్రవాహం. కవులు రచయితలు లేకపోతే తెలుగు ఇంత తియ్యగా ఉండేది కాదు అని వివరించారు. తదుపరి పాటిబండ్ల.శ్రీనివాసరావు గారు తెలుగులో మొదటి కావ్యం ఆంధ్ర మహాభారతం దీనిని నన్నయ వ్రాశాడు అందుకే ఆదికవి అంటారని వివరించారు. అలాగే తిక్కన,త్యాగరాజు, అన్నమయ్య, వేమన,మొదలవుకవుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు విద్యార్థినీ విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మూడో రోజుకు చేరుకున్న వారోత్సవాలు మైలవరం గ్రంధాలయం

మూడో రోజుకు చేరుకున్న వారోత్సవాలు మైలవరం గ్రంధాలయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *