Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

‘మనమిత్ర’తో సులభంగా సేవలు, ఫిర్యాదు స్థితి కూడా తెలుసుకోవచ్చు : అల్లూరి జిల్లా కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
‘మనమిత్ర’తో సులభంగా సేవలు, ఫిర్యాదు స్థితి కూడా తెలుసుకోవచ్చు : అల్లూరి జిల్లా కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, నవంబర్ 15: ప్రభుత్వ సేవలను ఇంటి వద్ద నుంచే సులభంగా, వేగంగా, పారదర్శకంగా పొందేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలను (95523 00009) అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ టి.
  • నిశాంతి సూచించారు.
  • ఈ సేవల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, ధృవీకరణ పత్రాల పొందడం, భూమి రికార్డుల తనిఖీ, ఫిర్యాదుల నమోదు, దరఖాస్తుల పురోగతి తెలుసుకోవడం వంటివి చేయవచ్చని ఆమె వివరించారు.

పాడేరు, నవంబర్ 15: ప్రభుత్వ సేవలను ఇంటి వద్ద నుంచే సులభంగా, వేగంగా, పారదర్శకంగా పొందేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలను (95523 00009) అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి సూచించారు.
ఈ సేవల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, ధృవీకరణ పత్రాల పొందడం, భూమి రికార్డుల తనిఖీ, ఫిర్యాదుల నమోదు, దరఖాస్తుల పురోగతి తెలుసుకోవడం వంటివి చేయవచ్చని ఆమె వివరించారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు.
‘ఫిర్యాదు పరిష్కరణ సేవలు’ అనే ప్రత్యేక విభాగంలో ఇప్పటికే నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయవచ్చు. పరిష్కారంపై అభిప్రాయం కూడా తెలపవచ్చు. చాట్‌లో కావాల్సిన సేవను నేరుగా టైప్ చేసి ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్‌లో సేవల కోసం ‘EN’ అని టైప్ చేయాలి.
డిజిటల్ సేవలపై అవగాహన పెంచుకుని ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *