రైతు జన కవనంలో రైతుకు కళాల మద్దతు తెలిపిన కవి మాన్యపు భుజేందర్
—————————————————————–
అఖిలభారత రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు సంఘీభావంగా నల్లగొండలోని టీఎన్జీవో భవన్లో బుధవారం రోజున తెలంగాణ సాహితీ, ప్రజానాట్యమండలి, ఏఐకేఎస్ నిర్వహణలో రైతు జనకవనం జరిగింది. రైతు కవి గాయక సమ్మేళనానికి ఆహ్వాన సంఘం ఆహ్వానించగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన కవి కళాకారుడు, పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ జన కవనం లో పాల్గొని “రైతుకు కలాల మద్దతు” అనే శీర్షికతో కవితా గానం చేయగా నిర్వాహకులు చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి కే ఆనందచారి, కట్టా నరసింహ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రసిద్ధ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, అతిధులు ఉరిమిళ్ళ సునంద, డా” సుంకి రెడ్డి నారాయణరెడ్డి, డా ” కృష్ణ కౌండిన్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి, మునాసు వెంకట్, బైరెడ్డి కృష్ణారెడ్డి, పగడాల నాగేందర్, గడ్డం నాగార్జున, వేముల ఆనంద్, ఏబూసి నరసింహ కపిల రామ్ కుమార్, కృష్ణ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కవి గాయకులు తదితరులు పాల్గొన్నారు. భుజేందర్ మాట్లాడుతూ నవంబర్ 14 నుండి 18 వ తేదీ వరకు నల్లగొండలో జరిగే అఖిలభారత జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని, అన్నదాతలకు మద్దతుగా కవి, గాయకులు, కళాకారులు, యువజనులు, శ్రామికులు అందరూ మద్దతు తెలపాలని కోరారు.

