Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూ.25 లక్షలతో సీతారామపురం బస్టేషన్ అభివృద్ధి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.25 లక్షలతో సీతారామపురం బస్టేషన్ అభివృద్ధి

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం ఆర్టీసీ బస్టేషన్‌ను రూ.25 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా ప్రజారవాణా సంస్థ డీఈఈ వై.
  • నాగభూషణం తెలిపారు.
  • అధికారులతో కలిసి ఆయన బస్టేషన్‌ను పరిశీలించి అభివృద్ధి పనులకు సంబంధించి స్థల కొలతలు సేకరించారు.

సీతారామపురం ఆర్టీసీ బస్టేషన్‌ను రూ.25 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా ప్రజారవాణా సంస్థ డీఈఈ వై. నాగభూషణం తెలిపారు. అధికారులతో కలిసి ఆయన బస్టేషన్‌ను పరిశీలించి అభివృద్ధి పనులకు సంబంధించి స్థల కొలతలు సేకరించారు. బస్టేషన్‌లో ప్రహరీ నిర్మాణం, మరుగుదొడ్లు, షాపులు, బోరుబావి, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఉదయగిరి డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. సీతారామపురం ప్రాంత ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *