Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దోమల నివారణకు గంబూషియా చేపల విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దోమల నివారణకు గంబూషియా చేపల విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మలేరియా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
  • ఇందులో భాగంగా గండిపాలెం, మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో గంబూషియా చేపలను విడుదల చేశారు.
  • మలేరియా అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఉదయగిరి: దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మలేరియా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గండిపాలెం, మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో గంబూషియా చేపలను విడుదల చేశారు. మలేరియా అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గంబూషియా చేపలు నీటిలోని దోమల లార్వాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా దోమల వృద్ధిని సహజసిద్ధంగా నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *