చెకుముకి సైన్స్ సంబురాలు – 2026
పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, డాక్టర్ వంశీ గారు
జనగామ జిల్లా జన విజ్ఞాన వేదిక తెలంగాణ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ -2026 గోడ పత్రికను రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు,డాక్టర్ వంశీ గారి చేతుల మీదుగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యాలయం జనగామలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు,జనగామ జిల్లా అధ్యక్షులు రాసాల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండె కనకయ్య వివరాలు తెలియజేస్తూ చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ని ఈ సంవత్సరం కూడా పాఠశాల స్థాయి, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించడం జరుగుతుందని, ఈ టెస్ట్ లో పాల్గొనటం వల్ల విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొదించవచ్చని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలలోని 8,9,10 తరగతులు చదివే విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నాలుగు దశలలో జరుగుతుందని పాఠశాల స్థాయిలో నవంబర్ 12న, మండల స్థాయిలో నవంబర్ 21న, జిల్లా స్థాయిలో నవంబర్ 28న, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 11,12,13 తేదీలలో మూడు రోజులపాటు CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కండ్లకోయ మేడ్చల్ రోడ్ హైదరాబాద్ నందు నిర్వహించడం జరుగుతుందని, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విజయవంతంగా సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణలో సహకరించాలని కోరారు. చెకుముకి ప్రశ్నపత్రాలు కావలిసిన వారు ఆయా మండలాల చెకుముకి కన్వీనర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం క్రింది మొబైల్ నెంబర్ లను 9346402030, 9951253676,9553242383 తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు పెట్లోజు శోభన్ బాబు, బానోతు రవీందర్, కాలూరి ఆంజనేయ చారి,సానికె సత్తయ్య, మాసాన్‌పల్లి లక్ష్మణ్ జి, గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
